Wednesday, March 11, 2015

గుంప క్షేత్రం - ఆలయ అభివృద్ది


స్థలపురాణం


ద్వాపరయుగమున శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు గోహత్య దోష నివారణకై పరమశివుని ప్రార్ధించగా, పరమశివుడు, ఏదైనానదీతీరమున ఐదు శివలింగములు ప్రతిష్ఠించమని సలహా ఇచ్చారు. అదే సమయములో ప్రజలు తమను కరువు బారి నుండి కాపాడవలసినదిగా బలరామ- కృష్ణులను కోరడం జరిగింది. ఓండ్ర (ఒరిస్సా) దేశములోగల కలహండి ప్రాంతములో నిరర్ధకంగా పడి వున్న జలాలను కరువు పీడిత ప్రాంతాలలో ప్రవహింప చేయడానికి బలరాముడు సంకల్పించాడు. తేరుబలి సమీపంలో పాయకపాడు వద్ద గల పర్వతపాదంలో పరమశ్వర లింగాన్ని భీమేశ్వరస్వామి నామంతో ప్రతిష్ఠించి, తన నాగలితో నదీప్రవాహానికి అడ్డుగా నిలచిన పర్వతాన్ని తొలచి ప్రవాహ మార్గాన్ని సుగమం చేసాడు.  తన ఆయుధమైన హలంతో ( నాగలి) భూమిని దున్నుతూ నడి ప్రవాహ మార్గాన్ని ఎర్పరిచాడు. ఆంతకు పూర్వం లాగుల్య గా పిలవబడిన నది నాగలి కారణంగా తన ప్రవాహాన్ని కొనసాగించింది కనుక ఈ నది నాగావళి గా మారింది. ఇప్పటికీ ఒరిస్సా రాష్ట్రంలో నాగావళి నదిని లాగుల్యగా వ్యవహరిస్తారు.

నాగలితో దున్నడం ప్రారంభించిన ప్రాంతంలో( పాయకపాడు) తొలిలింగం భీమేశ్వరలింగం ప్రతిష్టించబడింది. ఆ తరువాత నాగావళి, ఝంఝావతి సంగమ ప్రాంతమైన దేవునిగుంప వద్ద రెండవ లింగమైన సోమేశ్వరలింగం, నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదుల సంగమము వద్ద మూడవ లింగమైన సంగమేశ్వరలింగం, శ్రీకాకుళం వద్ద నాగావళి తీరాన నాల్గవదైన రుద్రకోటేశ్వరలింగం, సముద్రములో కలవడానికి ముందు కళ్ళేపల్లి వద్ద ఐదవ లింగమైన నాగేశ్వరలింగాన్ని ప్రతిష్టించడం జరిగింది. ఈ ఐదు లింగాలను పంచలింగాలని వ్యవహరిస్తారు.  పంచలింగాలు  నాగావళి నది ఒడ్డున ఒకే రోజు - అనగా "జేష్ట బహుళ ఏకాదశి " నాడు ప్రతిష్ఠించబడినవని పురాణ కథనం.   ఐదు క్షేత్రాల్ని ఒకే రోజు అభిషేకం చేసిన వాళ్ళకు పునర్జన్మ వుండదని నమ్ముతారు భక్తులు.


 
 

విన్నపం

కోటిపాం గ్రామ పంచాయతి, దేవుని గుంప గ్రామంలో నాగావళి, ఝంఝావతి నదుల సంగమ ప్రాంతం(దేవునిగుంప దీవి)లో వెలసిన శ్రీ సోమేస్వరస్వామి ఆలయం యొక్క ప్రాశస్త్యం, విశిష్టత తెలియనివారు కాని స్వామిని సందర్శించని కుటుంబాలు గుంప పరిసర ప్రంతాలలో ఊండరనేది అక్షర సత్యం. కాని ఇతర ప్రాంతములలో నివసిస్తున్న భక్తులకు గుంప క్షేత్రాన్ని దర్శించుకోవాలనే కోరిక వున్నా, గుంప రెండు నదుల మధ్యలో ఏర్పడిన దీవిలో ఉండటం వలన దర్శించుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఇంకా కనిపించని అనేక కారణాలవలన దేవాలయం, దాని పరిసర ప్రాంతాలు అభివృద్దికి దూరంగావున్నాయి. గతంలో గుంప గ్రామం నుండిగాని, దళాయిపేట గ్రామం నుండిగాని నదిని దాటి స్వామిని దర్శించే వీలువుండెది. కాని తోటపల్లి  ఆనకట్ట నిర్మాణం తరువాత ఈ గ్రామల మీదుగా నదులను దాటి స్వామిని దర్శించుకోవడం సమీపాన నివసుస్తున్న భక్తులకు కూడా చాలా కష్టంగా మారింది. భవిష్యత్తులో ఈ రెండు గ్రామల మీదుగా గుంప చేరుకొనే అవకాశం ఉండదు.
ఇక మిలినది దేవునిగుంప దీవికి పశ్చిమానగల కోటిపాం కాలనీ నుండి రోడ్డు నిర్మించి, చిన్న వంతెన నిర్మించడం. వంతెన పొడవు సుమారుగా 10 మీటర్లు ఉండవచ్చు. ఈ ఉద్దేశంతో కోటిపాం, గంగురేగువలస, కళ్ళీకోట  పంచాయితీలకు సంబందించిన గ్రామస్తులు సామావేశమై, ఆలయ అభివృద్దికి ఒక కమిటీని ఏర్పరచుకొని ముందుగా కోటిపాం కాలనీ నుండి నదివరకు ఒక కచ్చా దారిని ఏర్పరచడనికి నిర్ణయించారు. దీనికోసం ముగ్గురు, నలుగురు దాతలు స్వయంగా ముందుకుకువచ్చి సుమారుగా రూ. 1,15,000/- ఇచ్చారు. కొంతమంది రైతులు, గదబవలస గిరిజనులు అడిగిన వెంటనే రహదారి నిర్మాణనికి కావలసిన భూమిని విరాళంగా ఇచ్చారు. కాని ఇవి వంతెన నిర్మాణానికి సరిపోవని గుర్తించిన గ్రామస్తులు అందరూ కలసి తమ సంకల్పాన్ని వెనుకకు తీసుకోకుండా దీవికి, కోటిపాంకాలనికి మధ్యగల చిన్న నాగావళి పాయను అత్యంత వ్యయ ప్రయాసలకు గురై పూడ్చి కచ్చా రహదారిని పూర్తిచేసారు. దీనికోసం సమీప గ్రామస్తులు ఏకధాటిగా 8 రోజులు శ్రమించి 2015 ఫిబ్రవరి 17 న వచ్చిన శివరాత్రికి పూర్తిచేసి ప్రజలకు సొమేశ్వర దర్శనభాగ్యం కలిగించారు.  కానే రాబోయే వర్షాకాలం తరువాత ఈ కచ్చా రోడ్డుగాని, నాదిపాయలో వేసిన మట్టిగాని శశ్వతంగా ఉండే అవకాశంలేదు. 
రహదారిని, వంతెనను శాశ్వత నిర్మణాలుగా మార్చగలిగే ఆర్ధిక స్తోమత గ్రామస్తులకులేదు. 1971 నుండి దేవాదాయశాఖ ఆధీనంలోకి ఆలయం వెళ్ళిన తరువాత, ప్రతి శివరాత్రికి వచ్చిన కానుకలను స్వాధీనం చేసుకోవడమేగాని దేవాలయ అభివృద్దికిగాని, భక్తులకు సదుపాయాలు కల్పించడంలోగాని దేవాదాయ శాఖ విఫలం అయ్యింది. వీరిపై పోరాటం చేయల్సివుంది.

హలాయుధుడైన బలరాముడు తొలుత రైతు ప్రతినిధిగా మనకు దర్శన మిచ్చే పురాణ పురుషుడు.

 
ఆయన రైతుల కష్టాలను చూసి చలించి, కలహండి ప్రాంతం నుండి నాగావళని ప్రవహించేటట్లు చేసాడు. ఈ సందర్భములో ప్రతిష్టింపబడిన పంచలింగములలో రెండవదైన గుంప సోమేశ్వరస్వామి ఆలయాన్ని పరిరక్షింపవలసిన భాద్యత నాగావళి పైన ఆధారపడివున్న ప్రాంతం పైన ప్రధానంగా వుంది. ఈ ప్రాంతంలో నివసించి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను, విదేశాలలో ఉన్నతస్థాయిలో ఉన్నవారిని, మరియు ప్రపంచములోగల శివభక్తులందరినీ, దైవాన్ని విశ్వసించే వారందరిని గుంప సోమేశ్వర క్షేత్ర అభివృద్దికి చేయూత ఇవ్వవలసినదిగా, సహకరిచవలసినదిగా గ్రామస్తులు, ఆలయ అభివృద్ది కమిటి వినయ పూర్వకముగా కోరుకుంటున్నారు

సంప్రదించవలసిన నంబర్లు

1. 9440222311 (కోటిపాం గ్రామ సర్పంచ్)
2. 9581039215 (కళ్ళికోట గ్రామ సర్పంచ్)
3. 9949818491 (గంగురేగువలస, గ్రామ సర్పంచ్)
4. 9440343848 (రామారావు, ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు) tadithar@gmail.com

bank details

P..T RAMARAO, Central Bank of India, Parvathipuram A/C no- 3445902819 IFSC Code:- CBIN0283365

 
 

 
 

 



No comments:

Post a Comment